‘యన్‌.టి.ఆర్‌ సినిమా NTR kathanayakudu movie balakrishna,hansika,rakul,payal,vidya kalyan ram,sumanth,rana...

 ntr .
నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘యన్‌.టి.ఆర్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. బాలకృష్ణ ఇందులో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్బీకే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ సినిమా ఆడియో విడుదల వేడుక జరగనుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు.

‘ఆ రామారావు ఏంటి? కృష్ణుడేంటి?.. మార్చండి’ అని ఓ వ్యక్తి అంటే.. ‘రామారావు చక్కగా సరిపోతారండీ. ఆయన కళ్లల్లో ఓ కొంటెతనం ఉంటుంది’ అని మరో వ్యక్తి సమాధానం చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘నేను ఉద్యోగం మానేశా.. నచ్చలేదు.. సినిమాల్లోకి వెళ్తాను..’ అని బాలయ్య అంటున్నారు. ‘నిన్ను చూడ్డానికి జనాలు టికెట్టు కొని థియేటర్‌కు వస్తున్నారు. ఇలా నువ్వే వెళ్లి, కనిపిస్తే నీ సినిమాలు ఎవరు చూస్తారు’ అని ప్రశ్నిస్తే.. ‘జనం కోసమే సినిమా అనుకున్నాను. ఆ జనానికే అడ్డమైతే సినిమా కూడా వద్దు అంటాను’ అని సమాధానం ఇచ్చారు బాలయ్య. ‘60 ఏళ్లు వస్తున్నాయి.. ఇన్నాళ్లూ మా కోసం బతికాం... ఇక ప్రజల కోసం, ప్రజాసేవలో బతకాలి అనుకుంటున్నాం’ అని బాలయ్య తన నిర్ణయం చెప్పడం ఆకట్టుకుంది. ‘నిన్ను అందరూ ఇక్కడ దేవుడు అంటున్నారు. అక్కడ నువ్వు కూడా అందరిలాంటి మనిషివి అయిపోతావు బావా’ అని విద్యాబాలన్‌ అంటే.. ‘తారకం నన్ను దేవుడ్ని చేసిన మనుషుల కోసం నేను మళ్లీ మనిషిని కావడానికి సిద్ధంగా ఉన్నా’ అని బాలయ్య చెప్పారు.

ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా విద్యా బాలన్‌, నారా చంద్రబాబు నాయుడుగా రానా, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సావిత్రిగా నిత్యా మేనన్‌, ప్రభగా శ్రియ కనిపించనున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ బయోపిక్‌ను రెండు భాగాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్‌ బాల్యం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకూ ‘కథానాయకుడు’గా రాబోతోంది. అక్కడి నుంచి అంతిమ ఘడియల వరకూ ‘మహానాయకుడు’లో చూపించబోతున్నారు. తొలి భాగాన్ని వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది




























































































Comments

Popular posts from this blog

narthanasala movie actress yamini bhaskar telugu girl becomes telugu actress _ narthanasala actor naga shourya

alekhya actress celebrity #kondapalli #naidu #kgf #alekya